కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
- January 17, 2024
ఒట్టావా: దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయ విద్యార్థులకు సంఖ్యను కెనడా భారీగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య మూడవ త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది. గతేడాది డిసెంబర్‌లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లను కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 1,08,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86 శాతానికి పడిపోయినట్లు మార్క్ చెప్పారు. భారతీయులకు స్టడీ పర్మిట్ల సంఖ్య త్వరలో పుంజుకునే అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు.
కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకారం.. 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్‌లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతంగా ఉంది. 2022లో 225,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్‌లు లభించాయి. అయితే ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యతో కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జూన్‌లో చెప్పడంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







