జూలై 3న విడుదల కానున్న 'బస్తీ'

- June 29, 2015 , by Maagulf
జూలై 3న విడుదల కానున్న 'బస్తీ'

సహజనటి జయసుధ తనయుడు శ్రేయాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ వజ్‌మెన్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు మంతెన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం బస్తీ. ప్రగతి కథానాయిక. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఓ అందమైన ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ బస్తీ కుర్రోడు తన ప్రేమ కోసం ఏం చేశాడు? తనకు అనుకోకుండా ఎదురైన సమస్యను ఏవిధంగా పరిష్కరించుకున్నాడు? అన్నదే బస్తీ చిత్ర ప్రధాన కథాంశం. శ్రేయాన్‌కు తొలి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. ప్రగతి తనదైన అభినయంతో ఆకట్టుకుంటుంది. ఓ బస్తీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథాచిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కథ, కథనం హైలైట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రవీణ్ ఇమ్మడి చక్కని సంగీతం అందించాడు. పాటలు, నేపథ్య సంగీతం అలరిస్తాయి. ఓ సరికొత్త కథతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నాం అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, ముఖేష్‌రుషి, అభిమన్యుసింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: వడ్డాలపు ప్రభాకర్, ముని రాయపురెడ్డి, కెమెరా: వి.కె.గుణశేఖర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com