ఆలూ బ్రెడ్ బోండా
- June 29, 2015
కావలిసిన పదార్దాలు
ఆలూ - రెండు దుంపలు
బ్రెడ్ ముక్కలు - నాలుగు
పచ్చి బఠీనీ - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
ఆవాలు, జీలకర్ర, మినపప్పు - తాలింపుకు సరిపడా
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్డిగా
నూనె - సరిపడా
తయారీ విధానం
ముందుగా ఆలూ, పచ్చి బఠానీని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. తరువాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి, తాలింపు సామాన్లు వేసి, వేగాక, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేగిన తరువాత, ఉడికించి పెట్టుకున్న ఆలూ, పచ్చి బఠానీలను కూడా వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు కొద్దిగా ఛాట్ మసాలా పొడి వేసి బాగా ఉడికించి, ముద్దగా, కూరలా అయ్యేలా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మరొక బాణలి తీసుకుని, దానిలో నూనె వేసి బాగా మరిగాక, బ్రెడ్ ముక్కలను ఒక్కసారి నీటిలో ముంచి వెంటనే బయటికి తీసి దాని మధ్యలో ఈ ఆలూ, బఠానీ కూర స్టఫ్ చేసి బ్రెడ్ యొక్క నాలుగు మూలలూ జాగ్రత్తగా పట్టుకుని, బోండాలా చుట్టి జాగ్రత్తగా నూనెలో వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. అంతే నోరూరించే ఆలూ బ్రెడ్ బోండా రెడీ. టొమాటో కచప్తో లాగించేస్తే ఆలూ బ్రెడ్ బోండా టేస్ట్ డబుల్ అవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







