ఫిబ్రవరిలోనూ బాక్సాఫీస్ పోటీ తప్పేలా లేదు.!
- January 19, 2024
సంక్రాంతికి వాస్తవానికి ఐదు సినిమాలు బరిలో నిలిచాయ్. అలాగే కొన్ని తమిళ సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధమయ్యాయ్. కానీ, నిర్మాతల చర్చోపచర్చల అనంతరం సినిమాలు క్లాష్ అవ్వకుండా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది.
అలా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్‌కి సిద్ధమయ్యాయ్. ఈ ఏడాది ఓవరాల్‌గా సినీ ప్రియులకి సంక్రాంతి సందడి బాగానే సాగింది.
ఇదే సందడి ఫిబ్రవరి వరకూ కొనసాగనుంది. ఇక, ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆ సందడికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ఆల్రెడీ ఆ డేట్‌కి స్లాట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు మాస్ రాజా రవితేజ ‘ఈగల్’ ఒకటి. సందీప్ కిషన్ ‘ఊరు పేరు బైరవకోన’ ఇంకోటి.
ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా ఈ రెండు సినిమాలూ రిలీజ్ కానున్నాయ్. అయితే, వీటితో పాటూ, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లాల్ సలాం’ సినిమా కూడా రంగంలోకి దూకబోతోంది. సూపర్ స్టార్ సినిమాలకు తెలుగులో క్రేజ్ వేరే లెవల్. సో, బాక్సాఫీస్ వద్ద ఫిబ్రవరి పోరు కూడా గట్టిగానే వుండేలా తెలుస్తోంది. బాక్సాఫీస్ ఎప్పుడూ ఇలాగే కళకళలాడుతూ వుండాలి. ఈ పోరు ఆరోగ్యకరమే సుమా.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







