‘స్వయంభు’కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.?

- January 19, 2024 , by Maagulf
‘స్వయంభు’కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.?

ఓ వైపు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం.. మరో వైపు సహజంగానే హిందూ మతానికి సంబంధించిన ప్రచారం ఊపు మీదుండడం.. ఈ ఫార్ములా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకీ బాగానే వర్కవుట్ అవుతోంది.
హిందూయిజం బేస్ చేసుకుని రూపొందుతోన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అనూహ్యమైన సక్సెస్ అందుకుంటున్నాయ్ ఆయా సినిమాలు.
మొన్న ‘కార్తికేయ 2’ సినిమాకి అలాగే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. నేడు ‘హనుమాన్’ సినిమాకీ అదే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మరో సినిమా కూడా ఇదే పంథాలో రాబోతోంది.
అదే ‘స్వయంభు’. ‘కార్తికేయ 2’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లా అనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకీ హనుమంతుడి రంగులు అద్దబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరో హనుమంతుడికి పరమ భక్తుడిలా కనిపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. ఈ తాజా ప్రచారంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయ్. అసలే ఈ మధ్య సక్సెస్‌లలో వున్న హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కి ‘స్వయంభు’ కూడా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి మరి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి టార్గెట్‌గా ఈ సినిమా రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com