ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
- May 30, 2016
యూఏఈలో తొలి ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ సెంటర్‌ని ప్రారంభించారు. అప్‌టౌన్ హెల్త్ స్క్రీనింగ్ పేరుతో ఇది ప్రారంభించబడింది. హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ మరియు డైరెక్టర్ జనరల్ హమిద్ అల్ ఖతామి, అప్‌టౌన్ మిర్దిఫ్‌లో ఈ స్క్రీనింగ్ సెంటర్‌ని ప్రారంభించారు. 15 జాబ్ కేటగిరీస్‌లోని వారికి ఆక్యుపేషనల్ స్క్రీనింగ్ ఈ సెంటర్‌లో నిర్వహిస్తారు. ఆయా ప్రొఫెషన్ అవసరాలకు తగ్గట్టుగా సర్టిఫికేషన్ కోసం ఈ స్క్రీనింగ్ సెంటర్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్‌లు, ఎక్స్‌రే వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌రే రూమ్స్, బ్లడ్ కలెక్షన్ రూమ్స్, బ్లడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, ఆరు కన్సల్టేషన్ రూమ్స్ ఈ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. 4 నుంచి 5 పరీక్షలు 300 దిర్హామ్‌ల నుంచి 900 దిర్హామ్‌లదాకా ఖర్చుతో ఇక్కడ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







