కార్మిక హక్కులకు కట్టుబడి ఉన్నాం: మినిస్టర్
- May 30, 2016
కార్మికుల హక్కుల్ని పరిరక్షించేందుకు యూఏఈ కట్టుబడి ఉందని యూఏఈ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ బిన్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ చెప్పారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షించడంతోపాటుగా, వారికి చట్టాల పట్ల ఒప్పందాల పట్ల అవగాహన కల్పించడం అలాగే, కాంట్రాక్ట్ సంస్థలకూ కార్మికుల హక్కులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను మినిస్ట్రీ చేపడుతోందని ఆయన వివరించారు. జూన్ 10 వరకు జెనీవాలో జరిగే 105వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో మినిస్టర్, దేశంలో కార్మిక వ్యవస్థ బలోపేతంగా ఉందనీ, కార్మికులు స్వేచ్ఛగా సౌకర్యంగా పనిచేసుకునే అవకాశం దేశంలో కల్పిస్తున్నామని వివరించారు. ఐఎల్‌ఓ కాన్ఫరెన్స్‌లో యూఏఈ డెలిగేషన్ పలు విషయాలపై చర్చించనుంది. పబ్లిక్ సెక్టార్, ఎంప్లాయర్స్ మరియు వర్కర్స్ ప్రతినిథులు ఈ డెలిగేషన్‌లో భాగం పంచుకుంటున్నారు. 187 సభ్య దేశాల నుంచి ప్రతినిథులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరిస్థితుల్ని, అలాగే గ్లోబల్ చైన్స్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







