అబుదాబిలో మరణ ధృవీకరణ పత్రం, ఖనన విధానాలు సరళీకృతం
- January 21, 2024
యూఏఈ: అబుదాబిలో ఏడు ప్రభుత్వ సంస్థల సేవలను డిజిటల్‌గా మార్చింది. దీంతో మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, ఖననం కోసం ఏర్పాటు చేయడంతో సహా మరణించిన కుటుంబాల కోసం విధానాలను సులభతరం చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ - అబుదాబి (DoH) సనద్కోమ్ ఈ చొరవను ఆవిష్కరించింది.ఇది అబుదాబి ప్రోగ్రామ్ ఫర్ ఎఫర్ట్‌లెస్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో భాగంగా తీసుకొచ్చారు. మొదటి దశలో మరణించిన యూఏఈ జాతీయుల కుటుంబాలకు సేవలను అందిస్తుంది. తరువాతి దశలో ఇది ఎమిరేట్‌లోని నివాసితులందరినీ సేవలను విస్తరిస్తుందని DoH అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖమీస్ అల్ ఘైతి తెలిపారు. ఏ ప్రభుత్వ విభాగాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను అందించేలా ఫోన్ ద్వారా ఒక్కో కేసు ఆధారంగా మృతుల కుటుంబాలకు మద్దతు, సహాయాన్ని అందించడానికి ఉమ్మడి ప్రభుత్వ సహాయక బృందాన్ని నియమించనున్నట్లు తెలిపారు. ఇది మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, మరణించిన వ్యక్తి ఖననం, బీమా చేసిన లేదా వారి తరపున లబ్ధిదారులకు పదవీ విరమణ పెన్షన్ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి అవసరమైన అన్ని మరణ సంబంధిత లావాదేవీలను పూర్తి చేయడంలో కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటూ సహాయాన్ని అందిజేస్తారని వివరించారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







