శ్రామికులకు సరిపోని 3 గంటల మధ్యాహ్న విరామం
- June 29, 2015
పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసదీక్ష చేసే శ్రామికులకు మధ్యాహ్న విరామంగా 3 గంటల వ్యవధి సరిపోదని చెపుతున్న పైద్య ప్రముఖుల వాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆరుబయట పనిచేసే శ్రామికులకు ఉపవాసదీక్ష పెద్ద పరీక్ష. పెరిగిన తేమ శాతం వలన శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా, ద్రవ పదార్ధాలు కూడా తీసుకోనందున డీ -హైడ్రేషన్తో వడదెబ్బ తగలవచ్చు. శరీరంలోని ముఖ్య భాగాలైన మెదడు, కీడ్నీలు, హృదయం వంటి ముఖ్య అవయవాలపై ఇది ప్రభావం చూపుతుందని, చెమట పట్టకపోవడం, నీటిని స్వీకరించకపోవడం వంటి పరిస్థితుల వలన శరీర మెటబాలిసమ్ కూడా దెబ్బతినవచ్చునని ఆయన వివరించారు. అందువలన 12 నుండి 3 గంటల విరామం కాకుండా, చిన్న చిన్న పరిమాణాలు గల షిఫ్ట్ లు ఆరుబయట పనిచేసేవారికి సరైనవని దుబాయిలోని అస్తార్ మెడికల్ సెంటర్ జనరల్ ప్రాక్టీషనర్ డా. రోడేరిక్ ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







