జూలై 3న విడుదల కానున్న 'బస్తీ'
- June 29, 2015
సహజనటి జయసుధ తనయుడు శ్రేయాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ వజ్మెన్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు మంతెన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం బస్తీ. ప్రగతి కథానాయిక. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఓ అందమైన ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ బస్తీ కుర్రోడు తన ప్రేమ కోసం ఏం చేశాడు? తనకు అనుకోకుండా ఎదురైన సమస్యను ఏవిధంగా పరిష్కరించుకున్నాడు? అన్నదే బస్తీ చిత్ర ప్రధాన కథాంశం. శ్రేయాన్కు తొలి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. ప్రగతి తనదైన అభినయంతో ఆకట్టుకుంటుంది. ఓ బస్తీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథాచిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కథ, కథనం హైలైట్‌గా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రవీణ్ ఇమ్మడి చక్కని సంగీతం అందించాడు. పాటలు, నేపథ్య సంగీతం అలరిస్తాయి. ఓ సరికొత్త కథతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నాం అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, ముఖేష్‌రుషి, అభిమన్యుసింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: వడ్డాలపు ప్రభాకర్, ముని రాయపురెడ్డి, కెమెరా: వి.కె.గుణశేఖర్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







