గర్భిణీ స్త్రీల డైట్‌లో ఖచ్చితంగా వుండాల్సిందేంటంటే.!
- January 22, 2024
పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే.. అందుకు తగ్గట్లుగా గర్భిణి స్త్రీలు పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. వైద్యులు సూచించే మందులతో పాటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, తల్లితో పాటూ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బావుంటుంది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో జింక్ శాతం సరిపడా స్థాయిలో వుండాలి. కణ విభజన, ప్రొటీన్ సంశ్లేషణ సహా పిండం పెరుగుదలలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే గర్భిణీలు రోజుకు కనీసం 12mg మోతాదులో జింక్ కంటెంట్ తమ ఆహారంలో వుండేలా చూసుకోవాలి. మరి, జింక్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో ఫైబర్, ప్రోటీన్స్‌తో పాటూ, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ కూడా పుష్కలంగా వుంటుంది. అలాగే, బాదం పప్పులోనూ జింక్ లభిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు గర్భిణీ స్ర్తీలు చిరు తిండిలో భాగంగా చేసుకుంటే మంచిది.
నువ్వుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దాంతో పాటూ జింక్ కూడా తగిన మోతాదులో వుంటుంది. ప్రతీరోజూ గర్భిణులు బెల్లం కలిపిన నువ్వుల లడ్డును తింటే చాలా మంచిది. దీనితో పాటూ, పల్లీలు కూడా గర్భిణీ స్ర్తీలకు చాలా చాలా మంచి ఆహారం.
వాస్తవంగా చెప్పాలంటే.. శరీరంలోని ఎంజైమ్స్ అన్నీ సక్రమంగా పని చేయాలంటే జింక్ అవసరం తప్పనిసరి. సో, జింక్ లభించే ఆహార పదార్ధాలను అందరూ తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకోవాల్సిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







