200 కోట్ల క్లబ్బులోకి ‘హనుమాన్’.!
- January 22, 2024ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ సినిమాల్లో ఒకటి ‘హనుమాన్’. చిన్న సినిమా అయినా పెద్ద విజయం అందుకున్న సినిమా ఇది. గట్టిగా చెప్పాలంటే, ‘హనుమాన్’ని ఓ సినిమాలా కాకుండా అద్భుతంలా చూస్తున్నారు ఆడియన్స్.
అందుకు కారణం అంతకు ముందే లార్జ్ స్కేల్లో రిలీజైన ‘ఆది పురుష్’ నిరాశ పరచడమే. ఎంత వద్దనుకున్నా.. ‘ఆది పురుష్’ సినిమాతో ఈ సినిమాని పోల్చుకోకుండా వుండలేకపోతున్నారు ప్రేక్షక దేవుళ్లు.
ఆ సంగతి అటుంచితే.. ‘హనుమాన్’ సినిమాకి కలెక్షన్ల పంట పండుతూనే వుంది. పెద్ద సినిమాలు కూడా రేస్‌లో వున్నప్పటికీ.. ఈ సినిమాకే హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయ్.
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ కలెక్షన్ల జోరు తగ్గనే తగ్గడం లేదు. 100 కోట్లు ఈజీగా దాటేసింది. ఇక ఇప్పుడు 200 కోట్ల క్లబ్బులోకి కూడా చేరబోతోంది. మొదటి వారంలోనే కాదు కాదు, మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ‘హనుమాన్’.
ఇక, రెండో వారంలోనూ అదే తాకిడి కొనసాగుతోంది. ఒక్కసారి కాదు.. రెండు మూడు సార్లు చూడాలన్న కుతూహలం చూపిస్తున్నారు ‘హనుమాన్’ సినిమాని. దాంతో, భీభత్సమైన కలెక్షన్లు కురుస్తున్నాయ్. చూడాలి మరి, ఈ జోరు ఎన్నాళ్లు కొనసాగనుందో.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు