నితిన్ ఈ సారి ప్రయోగం చేయబోతున్నాడా.?
- January 23, 2024
‘ఎక్స్ట్రా ఆర్డినరీమేన్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్, ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ, ధియేటర్లలో ఈ సినిమాకి ఆదరణ దక్కకపోయినా.. ఓటీటీలో ఎక్స్ట్రా ఆర్డినరీమేన్కి మంచి ఆదరణ దక్కింది.
ఆధ్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాని ఓటీటీ ప్రేక్షకులు కుటుంబ సమేతంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాటిక్ లిబర్టీని పక్కన పెట్టేసి.. వినోదాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, ఇదే రెస్పాన్స్ ధియేటర్లో వుండి వుంటే.. నితిన్‌కి బాగా కలిసొచ్చేది. అదలా వుంటే, నితిన్ తాజా మూవీ ‘భీష్మ’ కాంబినేషన్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇప్పుడిదే కాంబినేషన్లో తాజా మూవీ స్టార్ట్ కాబోతోంది. మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్గా నటించాల్సి వుండగా.. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది.
అయితే, హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్లు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. శాంటా క్లాస్ డ్రస్‌లో వున్న నితిన్ ప్రీ లుక్ అది. వెనక నుంచి చూపించారు. జనవరి 26న ఈ పోస్టర్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రివీల్ చేయనున్నారని మేకర్లు ప్రకటించారు.
పోస్టర్ చూస్తుంటే.. ఈ సారి నితిన్, వెంకీ ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనీ.. ఇదో ప్రయోగాత్మక థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ అని అర్ధమవుతోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









