కొత్త భౌగోళిక పర్యాటక కేంద్రంగా అబూ అల్-వౌల్!

- January 23, 2024 , by Maagulf
కొత్త భౌగోళిక పర్యాటక కేంద్రంగా అబూ అల్-వౌల్!

రియాద్: సౌదీ జియోలాజికల్ సర్వే (SGS) మదీనాకు ఈశాన్యంగా ఉన్న అగ్నిపర్వత ఖైబర్ పర్వతాలలో.. రాజ్యంలో అతి పొడవైన గుహ అయిన అబూ అల్-వౌల్ గుహను కొత్త భౌగోళిక పర్యాటక కేంద్రంగా ఆమోదించింది. SGS ప్రతినిధి తారిఖ్ అబా అల్-ఖైల్ మాట్లాడుతూ.. ఒక ప్రత్యేక భౌగోళిక బృందం కింగ్‌డమ్‌లోని పొడవైన బసాల్ట్ గుహను ఐదు కిలోమీటర్ల పొడవుతో డాక్యుమెంట్ చేసిందన్నారు. సాంకేతిక అధ్యయనాలు పూర్తయిన తర్వాత గుహ పర్యాటక ఆకర్షణగా నామినేట్ చేయబడుతుందని వెల్లడించారు. గుహలో పెద్ద సంఖ్యలో ఐబెక్స్ అస్థిపంజరాలు ఉన్న దృష్ట్యా అబూ అల్-వౌల్ అనే పేరు పెట్టబడిందని వివరించారు. హర్రత్ ఖైబర్ మూడు జబల్ అల్-బైదా, జబల్ అల్-అబ్యాద్ మరియు జబల్ అల్-మన్సాఫ్ అరుదైన అగ్నిపర్వతాల శ్రేణిని కలిగిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com