24 ఏళ్ల తర్వాత శీతాకాలంలో రమదాన్..
- January 23, 2024
రమదాన్.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకునే పండగ.రమదాన్ నెల ప్రారంభం కోసం ముస్లీంలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి రమదాన్ ను ముస్లింలు..
24 ఏళ్ల తర్వాత వింటర్ సీజన్ లో జరుపుకోనున్నారు.శీతాకాలం.. డిసెంబర్ 21న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం..సౌదీ అరేబియాలో రమదాన్ నెల మార్చి 10న ప్రారంభం కానుండగా.. భారత్ లో మాత్రం మార్చి 11న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
షవ్వాల్ నెలవంకను బట్టి రమదాన్ నెల వ్యవధి 29 లేదా 30 రోజులు ఉండవచ్చు. చంద్రుని వీక్షించే సంప్రదాయం ఆధారంగా రమదాన్ ప్రారంభానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని నిర్ధారిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్లో రమదాన్ అత్యంత పవిత్రమైన నె. ముహమ్మద్ ప్రవక్తకు ఖురాన్ అవతరించిన నెలగా రమదాన్ ను భావించి ముస్లింలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెల ప్రారంభం నుచి ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో ఆహారంతోపాటు పానీయాలను కూడా తీసుకోకుండా పవిత్రంగా ఉంటారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







