కస్టమర్ దాడిలో గాయపడ్డ భారతీయ ప్రవాసి మృతి

- January 24, 2024 , by Maagulf
కస్టమర్ దాడిలో గాయపడ్డ భారతీయ ప్రవాసి మృతి

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో కస్టమర్ తో జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డ కె. బషీర్‌ బీడీఎఫ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెండాడు.  రిఫా హజియత్‌లో 25 ఏళ్లుగా కోల్డ్‌ స్టోర్‌ నిర్వహిస్తున్న కె. బషీర్‌.. ఒక అరబ్ కస్టమర్ గత వారం కొనుగోలు చేయడానికి అతని దుకాణానికి వచ్చారు. ఈ క్రమంలో కస్టమర్ తీసుకున్న వస్తువులకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా.. బషీర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కిందపడ్డ బషీర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న అతను మంగళవారం ఉదయం మరణించాడు. సీసీటీవీ ఫుటేజీతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ, KMCC (కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్) వెల్లడించాయి. చనిపోయిన బషీర్‌కు భార్య హైరున్నీసా, కుమారులు ఫాబియాస్, నిహాల్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com