సినీ జీవితం పూర్తి సంతృప్తి ఇచ్చింది : కైకాల
- May 31, 2016
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ కు ఇప్పుడు 81 ఏళ్ళు.. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గత కాలపు మంచి రోజుల్ని, తాను చేసిన గొప్ప పాత్రలను మళ్ళీ మళ్ళీ చూసుకుని శేషజీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నారు. దాదాపు 778 సినిమాల్లో నటించి మెప్పించిన కైకాల.. ఎస్వీఆర్, ఎన్టీఆర్ తర్వాత అంతటి మొనగాడనిపించుకున్న అద్భుత నటుడు. హీరోగా ప్రస్థానం మొదలెట్టి 13 సినిమాలు చేసి ఆ తర్వాత ప్రతినాయకుడిగా, కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డ ఆయన ఒక్క ఎన్టీఆర్ తోనే 101 సినిమాలు విలన్ గా, విలక్షణ నటుడిగా నటించారు..కానీ ఒక్క పాత్ర మాత్రం చేయలేకపోయానన్న వ్యథ ఆయనలో మిగిలిపోయింది. అది .మూగ పాత్ర. సందర్భానుసారం ఒకట్రెండు చిత్రాల్లో మూగ సన్నివేశాల్లో యాక్ట్ చేసిన ఫుల్ లెంగ్త్ మూగ పాత్ర దక్కలేదన్న బాధ ఆయనలో అలానే ఉండిపోయింది. ఇదే విషయాన్ని ఆయన నిన్న హైదరాబాద్ లో ఢిల్లీ తెలుగు అకాడెమీ నిర్వహించిన ఓ సన్మాన సభలో చెప్పారు. సినీ జీవితం పూర్తి సంతృప్తి ఇచ్చిందని చెప్పుకొచ్చిన ఆయన .. ఇదంతా ప్రజల ఆశీర్వాదమన్నారు. ఎక్కడో గుడివాడలో పుట్టి, చిన్న చిన్న నాటకాలేసుకొనే తనను ఇంతటి గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దిన ఘనత నిజంగా నాటితరం మేటి టెక్నీషియన్లు, దర్శకులదేనన్నారు
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







