నడకతోనూ మధుమేహానికి చెక్ పెట్టేయొచ్చా.?

- January 24, 2024 , by Maagulf
నడకతోనూ మధుమేహానికి చెక్ పెట్టేయొచ్చా.?

మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే చాలు.. జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. అయితే, మందులు వాడుతూనే డైట్ ఒకింత.. దినచర్యలోని కొన్ని మార్పులు ఇంకొంత.. ఇలా ఓ పర్‌ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మధుమేహం వున్నా హాయిగా జీవించేయొచ్చు.

డైట్ సంగతి అటుంచితే, నడక అనేది చాలా చాలా దీర్ఘకాలిక వ్యాధులకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. అలాగే, మధుమేహులకు కూడా నడక ఓ వరమే.

అయితే, మధుమేహం వున్న వారు ఓ పర్టిక్యులర్ వేగంతో ప్రతీరోజూ వాకింగ్ చేస్తే ఆ ఫలితాలు మరోలా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే.. మధుమేహం అదుపులో వుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఒకవేళ మధుమేహం లేని వాళ్లకయితే, ఇదే నడక తీరును ఫాలో చేస్తే.. భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువని ఓ సర్వేలో తాజాగా తేలింది.

అంతేకాదు, ఈ వేగాన్ని గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ పోతే.. ఇంకా మంచి ఫలితాలు చూడొచ్చట. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుంచి తపించుకునే అవకాశం మరో 15 శాతం పెరుగుతుందట. అయితే శరీర సామర్ధ్యాన్ని కూడా దృస్టిలో పెట్టుకుని ఈ నడక వేగాన్ని ఫాలో చేయాలని నిపుణుల హెచ్చరిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com