హెబ్బా పటేల్ అక్కడ అలా.! ఇక్కడ ఇలా.!
- January 24, 2024‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ తదితర చిత్రాల్లో నటించింది. తాను డెబ్యూ చేసిన హీరో రాజ్ తరుణ్‌తోనే దాదాపు మూడు నాలుగు సినిమాల్లో నటించేసిందీ ముద్దుగుమ్మ.
అయితే, వెండితెరపై హెబ్బా పటేల్‌కి గ్లామర్ ఎక్కువ వున్న పాత్రలే దక్కాయ్. పర్ఫామెన్స్కి చోటున్నప్పటికీ ఆమె గ్లామర్ మాత్రమే హైలైట్ అవుతూ వచ్చింది.
కానీ, ఓటీటీలో హెబ్బా పటేల్ పూర్తిగా భిన్నం. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి సినిమాలే కాదు, మరి కొన్ని వెబ్ సిరీస్‌లలో హబ్బా పటేల్ మేకోవర్.. చూపించిన నటనా ప్రతిభ వావ్ అనిపిస్తాయ్.
తాజాగా వెండితెరపై మరోసారి హెబ్బా పటేల్ సందడి చేయబోతోంది. అదే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో. ఈ సినిమా ప్రోమోస్ చూస్తుంటే.. ఇందులోనూ హెబ్బా పటేల్‌ని గ్లామర్ కోసమే వాడినట్లు కనిపిస్తోంది.
హీరో చైతన్య రావుతో హెబ్బా పటేల్ చేస్తున్న రొమాన్స్ కుర్రకారుకు హీట్ పెంచేస్తోంది. ఓటీటీలో మంచి స్కోపున్న క్యారెక్టర్లు దక్కించుకుంటున్న హెబ్బా పటేల్‌కి పెద్ద తెరపై ఎందుకు అలాంటి పాత్రలు దక్కడం లేదు. మేకర్లు దృష్టిలోనే ఏదో దృష్టి లోపం వుందేమో.!
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు