అదనపు డీజీపీలు డీసీ చౌహాన్, సౌమ్యా మిశ్రా కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
- January 25, 2024
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ పతకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.
వీరిలో తెలంగాణ నుంచి 20 మందికి పతకాలు దక్కాయి.అందులో రాష్ట్రానికి 6 గ్యాలెంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు ఉన్నాయి. సీనియర్ పోలీసు అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్, అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ ఎస్సై, 12 మంది అధికారులు విశిష్ట సేవ పతకాలు లభించాయి. వీరితోపాటు ఇద్దరు జైళ్ల శాఖ అధికారులు ప్రెసిడెంట్ మెడల్స్ అందుకోనున్నారు. ఇక ఉత్తమ ప్రతిభ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 9 అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







