పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమవుతాయ్.!
- January 25, 2024
ఏపీలో రాజకీయ పరిస్థితులు ఊపందుకున్నాయ్. జోరు పెరిగింది. తీరు మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలపైనే అందరి దృష్టి. ఏమో. ఈక్వేషన్స్ కలిసొచ్చి పవర్ స్టార్ పవర్ దక్కించుకుంటే.. ఆయన చేయాల్సిన సినిమాలు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు.
ఇంకా పట్టాలెక్కని ప్రాజెక్టులు క్యాన్సిల్ అయితే కావచ్చు గాక.! కానీ, ఆల్రెడీ కొంత మేర షూటింగ్ చేసిన ప్రాజెక్టుల పరిస్థితేంటీ.? మింగలేక, కక్కలేక అన్న చందంగా మారింది ఆయా సినిమాల మేకర్ల పరిస్థితి.
ప్రస్తుత రాజకీయాల పరిస్థితి చూస్తుంటే, జనసేనకు క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది ఏపీలో. ఈ నేపథ్యంలోనే తమకు సినిమాల కన్నా.. పవరే ముఖ్యమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోయారట.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. లేదంటే ఏదో ఒక మంత్రి గిరీ దక్కించుకున్నా కానీ, పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరమే.! నిర్మాతలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా.. తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా.. ఈ పరిస్థితిని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







