సమంత వదిలేసింది.! వాళ్లు పట్టుకున్నారు.!
- January 25, 2024
నేషనల్ క్రష్ రష్మిక మండన్నాఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘రెయిన్ బో’ సినిమా. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా సమంతను అనుకున్నారట.
కానీ, రష్మికతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అలాగే, ఇప్పుడు మరో సినిమా కూడా సమంత చేయాల్సింది శృతి హాసన్ చేతికొచ్చిందని సమాచారం. సినిమా ఏంటీ.? కథ, కాకరకాయ్ వంటి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
కానీ, ఆ ప్రాజెక్ట్‌ని సమంత కోసమే సిద్ధం చేశారట. కానీ, ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా వుంటూ, కేవలం సోసల్ మీడియాకే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే ఆమె చేయాల్సిన సినిమాలన్నీ ఇలా వాళ్లూ వీళ్లూ ఎగరేసుకుని వెళ్లిపోతున్నారు. అలాగే మొన్నా మధ్య ఓ వెబ్ సిరీస్‌లోనూ సమంత నటించింది. కానీ, ఆ సిరీస్ పరిస్థితేంటో ఇంతవరకూ తెలీదు.
అదే సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. కానీ, సమంత నటించిన వెర్షన్ కనీసం అప్‌డేట్ కూడా లేదు. ఇదిలాగే కొనసాగితే.. సమంతను ముందు ముందు ఆడియన్స్ మర్చిపోయేలా వున్నారు. అంతేకాదు, ఇకపై సమంత నటిగా కొనసాగుతుందా.? లేదా.? అనే అయోమయంలోనూ ఆమె ఫ్యాన్స్ కొందరు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







