పోలీస్ స్టేషన్లో పోసాని..
- May 31, 2016
మెంటల్ కృష్ణ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనేనండి మన పోసాని కృష్ణ మురళి. ఇండస్ట్రీలో ఎవరితోనూ గొడవ పెట్టుకోడనే పేరున్న పోసాని పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లాడు అనేదే కదా మీ అనుమానం. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న పోసాని కృష్ణ మురళిని ఎవరో నరేష్ అనే వ్యక్తి ఫోన్లోనూ.. మెసేజ్ ల ద్వారా భయపెడుతున్నాడని, తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. నరేష్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టుగా కేస్ పెట్టాడు. కేస్ ఫైల్ చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోసాని కృష్ణ మురళి కాల్ డేటాను పోలీసులు తీసుకుంటున్నారు. ఇక అసలు నరేష్ అన్న వ్యక్తి ఎందుకు పోసానిని టార్గెట్ చేశాడు. పోసానికి వారికి ఉన్న గొడవలు ఏంటన్నది విచారణ చేపట్టనున్నారు. స్టేషన్ కు వచ్చిన పోసానిని చూసి ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హడావుడి ఏర్పడింది. నరేష్ ఎవరో కాదు.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ దర్శకుడి తమ్ముడే. ఒకప్పుడు ఆయన మంచి మంచి సినిమాలు కూడా చేశాడు. ఈ మధ్య కాస్త రేస్ లో వెనకబడిపోయాడు అది వేరే విషయం. ఆయన గారి తమ్ముడే ఇప్పుడు పోసానిని వేధించింది. అది కూడా డబ్బు వ్యవహారం కోసమే. తరుచూ ఆ వ్యక్తి పోసానికి ఫోన్ చేసి డబ్బు అప్పుగా ఇవ్వమని వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాడట. దాంతో విసిగిపోయిన పోసాని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడని సమాచారం.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







