పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

- January 25, 2024 , by Maagulf
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

న్యూ ఢిల్లీ: భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిగా.. అందులో ఐదుగురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.

పద్మ విభూషణ్!

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి.

పద్మ శ్రీ వీరికే..

తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిలను ఈ అవార్డులు వరించాయి.

సాంప్రదాయకంగా పురుషాధిక్య రంగంలో తనకంటూ ఒక స్థలాన్ని సృష్టించుకోవడానికి మూస పద్ధతులను అధిగమించిన భారతదేశపు తొలి మహిళా ఏనుగు మహోట్ పార్బతి బారుకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రకటించారు. అలాగే.. కళలు విభాగంలో బిహార్‌కు చెందిన భార్యాభర్తలు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్‌కు.. త్రిపురకు చెందిన చక్మా రేఖాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com