మస్కట్‌లో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం
- January 26, 2024
మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఉదయం ఘనగా జరుపుకుంది. ఒమన్ సుల్తానేట్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్ తోపాటు 500 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాయబారి అమిత్ నారంగ్, అతని భార్య దివ్య నారంగ్ ఎంబసీలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోని సారాంశాలను రాయబారి చదివి వినిపించారు. ఇండియన్ స్కూల్ బౌషర్ విద్యార్థులు రెండు దేశభక్తి గీతాలను ప్రదర్శించడంతో కార్యక్రమం ముగిసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల కొనసాగింపుగా.. జనవరి 28న సాయంత్రం ఎంబసీ ద్వారా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







