విజటర్స్ ఎంట్రీ కోసం ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్కోడ్ స్కానర్లు
- January 26, 2024
రియాద్: ప్రవక్త మసీదు ఏజెన్సీ , సంబంధిత అధికారులు మదీనాలోని ప్రవక్త మసీదు వద్ద రౌదా షరీఫ్‌ను సందర్శించడానికి కొత్త సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇకపై రౌదా షరీఫ్లోకి ప్రవేశించడానికి సందర్శకులు ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్‌కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. రౌదా సందర్శనకు సంబంధించిన విధానాలు తప్పనిసరిగా నుసుక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అప్లై చేసుకోవాలని ఏజెన్సీ పేర్కొంది. అప్లికేషన్ ద్వారా రిజర్వేషన్ చేసిన తర్వాత సందర్శకుడు అపాయింట్మెంట్ను నిర్ధారిస్తూ మెసేజ్ ను అందుకుంటారు. తరువాత, సందర్శకుడికి సందర్శన తేదీకి 24 గంటల ముందు అపాయింట్మెంట్ గురించి మరోసారి గుర్తుచేస్తారు. విజిటర్ నిర్ధిష్ట సమయానికి ముందు సందర్శన కోసం బార్‌కోడ్‌ను ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. రౌదా షరీఫ్‌కు చేరుకోవడానికి ముందు, సందర్శకుడు బార్‌కోడ్‌ను ఆటోమేటెడ్ గేట్ల ద్వారా స్కాన్ చేసి, ఆపై వేచి ఉండే ప్రదేశానికి వెళ్లి, ఆపై ప్రవేశం పొందాల్సి ఉంటుంది. సందర్శకుల సంఖ్యను తెలుసుకోవడానికి స్మార్ట్ కెమెరాలు, సెన్సార్ల ద్వారా పనిచేసే అధునాతన డిజిటల్ సిస్టమ్‌ల ద్వారా కూడా ఫాలో-అప్ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







