ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం..
- January 26, 2024
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచలనం నమోదైంది. సెర్భియా స్టార్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. సెమీ ఫైనల్ మ్యాచులో అతడు యువ ఆటగాడి చేతిలో ఓటమి పాలైయ్యాడు. దీంతో అతడు ఇంటి ముఖం పట్టాడు.
శుక్రవారం జకోవిచ్, ఇటలీకి చెందిన జనిక్ సినర్ ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జనిక్ సినర్ 6-1, 6-2, 6-7 (6/8), 6-3 తేడాతో జకోవిచ్ పై విజయం సాధించాడు. దీంతో సినర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా.. గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడం నాలుగో ర్యాంకర్ అయిన సినర్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరో సెమీఫైనల్ మ్యాచులో మద్వెదెవ్-జెరెవ్‌లో ఎవరు గెలిస్తే వారితో సినర్ ఫైనల్ మ్యాచులో తలపడనున్నాడు.
సెమీఫైనల్ మ్యాచులో జకోవిచ్ ఆరంభం నుంచే తలబడ్డాడు. దీంతో వరుసగా మొదటి రెండు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో అతడు పుంజుకున్నాడు. మూడో సెట్‌లో విజయం సాధించి మ్యాచులో నిలిచాడు.
అయితే.. కీలకమైన నాలుగో సెట్‌లో మరోసారి సినర్ పట్టు సాధించాడు. జకో సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినర్ 6-3తేడాతో సెట్‌తో చేజిక్కించుకోవడంతో పాటు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా జకోవిచ్ ఈ మ్యాచ్‌లో నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా సినర్ ఒకటి మాత్రమే చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







