CARE వ్యవస్థతో భారత్‌కు మృతదేహాల తరలింపు ఆలస్యం!
- January 27, 2024
యూఏఈ: దుబాయ్‌కు చెందిన సాంఘిక సంక్షేమ సంస్థ ప్రవాసీ ఇండియా.. మరణించిన భారతీయ పౌరులను విదేశాల నుండి త్వరగా తరలించడానికి ఆగస్టు 2023లో ప్రారంభించిన భారత ప్రభుత్వం యొక్క CARE (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ ఫర్ రీపాట్రీయేషన్ ఆఫ్ మోర్టల్ రిమేన్స్) వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 25న ప్రవాసీ ఇండియా పోర్టల్‌ను రద్దు చేయాలని కోరుతూ అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి మెమోరాండం సమర్పించింది. ప్రవాసీ ఇండియా మీడియా సెక్రటరీ హఫీసుల్ హక్ మాట్లాడుతూ.. eCARE పోర్టల్ విధానాల వల్ల జరిగే జాప్యం కారణంగా బాధిత కుటుంబాలు తీవ్రమానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థికంగాను ఇబ్బందులను సృష్టిస్తున్నాయని వివరించారు. తరచుగా సిస్టమ్ నిర్దేశిత ఆమోదం కాలపరిమితి 12 గంటల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ ప్రేమ్ చంద్, కమ్యూనిటీ అఫైర్స్ అటాచ్ గౌరవ్ కుమార్ సింగ్‌తో సమావేశమైన సందర్భంగా.. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా సవాద్తో సహా ప్రవాసీ ఇండియా ప్రతినిధులు ఆందోళనలను వివరిస్తూ పరిష్కార చర్యలను ప్రతిపాదించారు. ముఖ్యంగా తక్కువ-ఆదాయం ఉన్న వ్యక్తులు, సామాజిక మద్దతు లేని వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జనవరిలో ఆరు మృతదేహాలను స్వదేశానికి రప్పించడంలో సహకరించిన ప్రవాసీ ఇండియా eCARE వ్యవస్థను రద్దు చేయాలని వాదించింది. మరోవైపు ప్రవాసీ ఇండియా ఆందోళనలకు యూఏఈ-ఆధారిత భారతీయ సామాజిక వ్యక్తి అష్రఫ్ థమరాస్సేరి తప్పుబట్టారు. ఈ సిస్టమ్ మునుపటి విధానాలతో పోలిస్తే వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. 2015లో ప్రవాసీ భారతీయ సమ్మాన్‌తో సత్కరించబడిన అష్రఫ్ రెండు దశాబ్దాలుగా యూఏఈ నుండి మృతదేహాలను ఇండియాకు తరలించడంలో సహాయంగా ఉంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







