యూఏఈలో బాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ 'ఫైటర్' పై నిషేధం?
- January 27, 2024
యూఏఈ: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ 'ఫైటర్' జనవరి 27న యూఏఈలో విడుదల కాలేదు. అయితే, హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొణె నటించిన చిత్రం యూఏఈ మినహా గల్ఫ్ అంతటా నిషేధించబడుతుందని భారతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి . VOX మరియు రీల్ సినిమాస్‌కి చెందిన కస్టమర్ కేర్ ఏజెంట్లు మాత్రం ఈ సినిమా యూఏఈలోను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. "ఈ చిత్రాన్ని దుబాయ్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని సినిమా థియేటర్లలో షోలను నిలిపివేసింది. ప్రస్తుతానికి మాకు తదుపరి సమాచారం లేదు." అని రీల్ సినిమాస్ కస్టమర్ కేర్ ఏజెంట్ కాల్లో తెలిపారు. యూఏఈలో ఈ చిత్రం పంపిణీదారు, హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కూడా బాలీవుడ్ సినిమా విడుదలను నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇదిలా ఉండగా యూఏఈ నేషనల్ మీడియా కౌన్సిల్ దేశంలోని చలనచిత్రాల అధికారిక నియంత్రణ అధికారులు సినిమా సస్పెన్షన్‌పై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
'ఫైటర్' అనేది భారత వైమానిక దళ సభ్యుల చుట్టూ తిరిగే యుద్దం ఆధారిత సినిమా. ఇది షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్), మినల్ రాథోర్ (దీపికా పదుకొణె) భారతదేశ జాతీయ భద్రతా పరిస్థితులను నావిగేట్ చేస్తున్నప్పుడు వారి జీవితాన్ని చూపిస్తుంది. యూఏఈలో భారతీయ సినిమా నిలిపివేయడం లేదా ఆలస్యం కావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో మలయాళ చిత్రం 'సీతా రామం' కూడా ఆలస్యంగా విడుదలైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







