పద్మ విభూషణుడు చిరంజీవికి ఘన సత్కారం.!

- January 27, 2024 , by Maagulf
పద్మ విభూషణుడు చిరంజీవికి ఘన సత్కారం.!

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి ఘన సత్కారం చేయబోతున్నారు.
సినీ ప్రముఖులంతా ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కానున్నారు. త్వరలో జరగబోయే ఈ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించబోతున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
టాలీవుడ్ నుంచే కాకుండా.. వివిధ సినీ పరిశ్రమల నుంచి కూడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేవలం సినీ నటుడు మాత్రమే కాదు చిరంజీవి.
ఎంతో మందికి ఆయన జీవితం స్పూర్తి. అలాగే, ఎంతో మంది పేదల పాలిట పెన్నధి ఆయన. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి చారిటీ ట్రస్టులతో ఎంతో మందికి ప్రాణ దాత అయ్యారాయన.
సెలబ్రిటీగా ఎందరికో స్పూర్థిగా వుండడంతో పాటూ, అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన సేవలను మెచ్చి పద్మ విభూషణ్ ఆయనను ఏరి కోరి వరించింది. ఈ సందర్భంగా పద్మ విభూషణుడు చిరంజీవికి మనం కూడా శుభాకాంక్షలు తెలుపుకుందాం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com