ఓటీటీలోనూ ‘యానిమల్’ క్రేజ్ తగ్గేదేలే.!
- January 27, 2024
ధియేటర్లలో సెన్సేషనల్ అయిన సినిమా ‘యానిమల్’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఓటీటీ డేట్ అనౌన్స్ చేయడంతోనే ‘యానిమల్’ ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేసింది.
చూసేందుకు ఉత్కంఠగా ఎదురు చూశారు ఓటీటీ జనం. ధియేటర్లలో ఈ సినిమాని చూసిన చాలా మంది బాగుంది అనుకున్నప్పటికీ మరికొంత మంది మాత్రం తిట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ‘యానిమల్’ టీమ్‌ని విమర్శించిన సంగతీ తెలిసిందే. అయినా కానీ, కమర్షియల్‌గా బిగ్గెస్ట్ కలెక్షన్లు దక్కించుకుంది ‘యానిమల్’ సినిమా.
ఇప్పుడు ఓటీటీలోనూ అదే హంగామా నడుస్తోంది. అయితే, కొందరు ఓటీటీలో ఈ సినిమా తిలకించాకా.. ఇదేం సినిమా.? అంటూ ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్లను.. తండ్రిపై ఓ కొడుకి పిచ్చి ప్రేమ సందర్భంగా వచ్చే కొన్ని ‘అతి’ సన్నివేశాలనూ ఇబ్బందికరంగా ఫీలవుతున్నారు.
కొందరైతే కంప్లయింట్లు కూడా స్టార్ట్ చేశారు. దాంతో, ఆయా సన్నివేశాలను సెన్సార్ చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయ్. ఈ మధ్య ఓటీటీలో రిలీజైన కొన్ని సినిమాలు అభ్యంతరాలకు కట్టుబడి, మనోభావాలకు కట్టుబడి.. బ్యాన్ అవుతున్న సంగతి తెలిసిందే.
రీసెంట్‌గా నయనతార సినిమాకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చివరికి ఆ సినిమాని ఓటీటీ నుంచి తొలిగించేసిన సందర్భాన్ని కూడా చూశాం. మరి, ఓటీటీలో ‘యానిమల్’ ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలిక.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







