‘రంగస్థలం’ కాంబో రిపీట్.!
- January 27, 2024
దర్శకుల యందు దర్శకుడు సుకుమార్ స్టైల్ వేరయా అనడం అతిశయోక్తి కాదేమో. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు పోటీ పడుతుంటారు.
ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్‌తో పుష్ప 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఆయన శిష్యరికం నుంచి వచ్చిన పలువురు దర్శకులు సైతం మంచి పేరు తెచ్చుకుంటున్నారు దర్శకత్వ విభాగంలో.
‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సన ఆ లిస్టుకి చెందినవాడే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సుకుమార్ మరో కొత్త ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాడనీ తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ మరెవరి కోసమో కాదు.. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసమట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
ఇదే కాంబో మళ్లీ రిపీట్ అవుతుందంటే అంచనాలు ఆ స్థాయిలోనే వుంటాయ్. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత బుచ్చిబాబు సన సినిమాలో నటించాల్సి వుంది. ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, సుకుమార్ మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో.! ఒకవేళ అదే జరిగితే.. మళ్లీ అదో సంచలనమే.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







