బీహార్లో కొలువుదీరనున్న ఎన్డీయే ప్రభుత్వం..
- January 28, 2024
పాట్నా: బీహార్ లో గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి తెరపడనోంది.. నితీశ్ కుమార్ ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి సీఎం పదవికి రాజీనామా లేఖను అందజేశారు. మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. మరోవైపు బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ రాజేంద్రను నితీశ్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. ఆయన అభ్యర్థనకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో సాయంత్రం 5గంటల సమయంలో గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలతో పాటు ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎంతో ప్రమాణ స్వీకారం చేసేవారిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి (బీజేపీ), విజయ్ కుమార్ సిన్హా(బీజేపీ) ఉన్నారు. వీరితో పాటు మంత్రులుగా డాక్టర్ ప్రేమ్ కుమార్ (బీజేపీ), విజేంద్ర యాదవ్ (జేడీయూ), విజయ్ చౌదరి (జేడీయూ), శ్రవణ్ కుమార్ (జేడీయూ), సంతోష్ సుమన్ (హెచ్ఏఎం), సుమిత్ సింగ్ (స్వతంత్ర)లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన పట్నాకు చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









