'తహయేమ్ వింటర్ సీజన్' ప్రారంభం
- January 28, 2024
ఒమాన్: జలాన్ బని బు హసన్: తహయేమ్ వింటర్ సీజన్ జనవరి 25న దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లోని జలాన్ బనీ బు హసన్ విలాయత్‌లో వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రి డాక్టర్ సౌద్ బిన్ హమూద్ అల్ హబ్సీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో తహయేమ్ వింటర్ సీజన్ కార్యకలాపాల గురించి ఆయన వివరించారు. అన్ని రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటక కార్యకలాపాలను ఇది పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ యొక్క విలాయాత్స్.. 2024 సంవత్సరానికి అరబ్ టూరిజం కోసం రాజధానిగా సుర్ని ఎంపిక చేయడంతో ముగుస్తుందన్నారు. ఖర్జూరాలు, తేనె కోసం అంతర్జాతీయ ప్రదర్శన ద్వారా తహయేమ్ వింటర్ సీజన్లో మంత్రిత్వ శాఖ సమర్థవంతంగా పాల్గొనడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ, ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న 180 కంపెనీలు పాల్గొన్నాయి. స్థానిక ప్యాకింగ్ కంపెనీలు ఇన్నోవేషన్ కార్నర్, చిల్డ్రన్ కార్నర్ మరియు గేమ్స్ ఏరియాలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







