సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రారంభం
- January 29, 2024
ఖాసబ్: సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 5వ ఎడిషన్ ఆదివారం ఖాసబ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ లో ప్రారంభమైంది. సాంస్కృతిక, క్రీడలు మరియు యూత్ ఫర్ కల్చర్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సయ్యద్ సయీద్ బిన్ సుల్తాన్ అల్ బుసైదీ ఆధ్వర్యంలో ముసండం గవర్నరేట్ గవర్నర్ కార్యాలయం, అనేక ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నాయి. సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పండుగతో పాటు జరిగే కార్యకలాపాలు మరియు కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక, పర్యాటక మరియు ఆర్థిక అంశాలపై ఫోకస్ చేశాయి. సినిమా సంస్కృతిని, చిత్ర పరిశ్రమ రంగంలో యువ ప్రతిభను గుర్తించడం , వినూత్న కంటెంట్‌ను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కూడా దీని లక్ష్యమని వక్తలు తెలిపారు. ప్రారంభ వేడుకలో ఆరు డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు, పదకొండు లఘు డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఓమనీ చిత్ర దర్శకుడు సుల్తాన్ అల్ అహ్మద్ రూపొందించిన ‘ఎ టేల్ ఆఫ్ ఎ కాజిల్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఒమానీ కళాకారులు, అరబ్ అతిథులు, ఈవెంట్‌ను స్పాన్సర్ చేసిన ప్రభుత్వ - ప్రైవేట్ సంస్థలను సత్కరించారు. సినిమానా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చైర్మన్ డాక్టర్ ఖలీద్ బిన్ అబ్దుల్రహీమ్ అల్ జడ్జాలీ ఈ బృందానికి అధ్యక్షత వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







