అధికార దుర్వినియోగం.. అల్‌యూలా సీఈఓ అరెస్ట్
- January 29, 2024
రియాద్: అధికార దుర్వినియోగం మరియు SR206 మిలియన్ల మనీలాండరింగ్ ఆరోపణలపై అల్‌యూలా (AlUla) సీఈఓ ఇంజినీర్ అమ్ర్ అల్-మదానీ అరెస్టు చేశారు. ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకారం.. ఒక కంపెనీలో అల్-మదానీ భాగస్వాములను కూడా అరెస్టు చేశారు. కింగ్ అబ్దుల్లా సిటీ నుండి అటామిక్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం నేషనల్ టాలెంట్స్ కంపెనీకి చట్టవిరుద్ధమైన పద్ధతిలో కాంట్రాక్టులు పొందడం ద్వారా అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు అల్-మదానీని అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ యజమానుల్లో ఒకరైన అల్-మదానీ ప్రభుత్వ రంగంలో చేరడానికి ముందు కాలంలో తన బంధువుల్లో ఒకరి ద్వారా ఈ నేరానికి పాల్పడ్డాడు. మొత్తం పాల్గొన్న SR20,66,30,905 నగదు చేతులు మారింది. ప్రభుత్వ విధుల్లో చేరిన తర్వాత అల్-మదానీ అధికారికంగా కంపెనీ నుండి నిష్క్రమించాడు. కానీ కంపెనీలో తన యాజమాన్యాన్ని కొనసాగించాడు. అతను రాయల్ కమీషన్ తో తమ బంధువకులకు చెందిన కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సిఫార్సు చేసాడు. మొత్తం SR12,98,923 విలువ కలిగిన ప్రాజెక్ట్‌లను పొందారు. తద్వారా అతను వ్యక్తిగత ప్రయోజనాలను అందుకున్నాడు. ఇదే కేసులో సౌదీ పౌరుడైన బంధువు ముహమ్మద్ బిన్ సులైమాన్ అల్-హర్బీని కూడా అరెస్టు చేశారు. అనుమానితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని, వారిని న్యాయస్థానానికి రిఫర్ చేస్తామని నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







