కెనడాలో అంబరాన్ని అంటిన సంక్రాంతి వేడుకలు
- January 29, 2024
కెనడా: మన తెలుగు ప్రజలు, కెనడా, నోవా స్కోటియాలో సంక్రాంతి పండుగను ఎంతో రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.
హాలిఫాక్స్, డార్ట్ మౌత్ , బెడ్ ఫోర్డ్ మరియు సమీప గ్రామికులందరు కలసి బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు . నిర్వాహకులు సుప్రజా హరి, ప్రియాంక సురేష్ గారు, కుమారి శ్రీలేఖ మరియు వారి బృందం కలిసి వేదికను మన సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులతో, గాలిపటాలతో, పూల తోరణాలతో , భోగి కుండలతో అలంకరించారు, ఇది పండుగ యొక్క జనన అనుభూతిని కలిగించింది. కెనడా నోవా స్కోటియాలోని 300 కి పైగా తెలుగు కుటుంబాలు వేడుకకు పండుగ కళను తీసుకురావడానికి అచ్చ తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి కన్నుల విందు చేశారు.
అతిథి దేవోభవ అని పెద్దలచే (కెనడాకి విజిటింగ్ కి వచ్చిన వారు) జ్యోతి ప్రజ్వలన కనకం, దేవిక , పార్వతి, ప్రతిభ, సుప్రజాహరి చేయించి, గణేశ వందనంతో సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు.
ఈ వేడుకలు కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీహరి రెడ్డి చల్లా ఆధ్వర్యంలో స్పాన్సర్లు (కెనడా ఎడ్యుకేషన్ కనెక్ట్- విజయ్ రాహుల్ భాష్యకర్ల , శ్రీహరి రెడ్డి చల్లా , ఇండియన్ గ్రోసరీస్ - జితేందర్ బాలి, టైటాన్ ఓక్ ఫైనాన్షియల్ సర్వీస్ యాజమాన్యం: ఆండ్రూ లీపర్ , వన్ రియాల్టీ ఈస్ట్ -శివ నవనీథన్ మరియు శ్రీహరి బృందం సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం తెలుగు పండుగలకు మూలమని, భావితరాలకు మన సంప్రదాయాలను తెలియజేసేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
నృత్య వేదికలో పిల్లలు నిత్య శ్రీ విద్య, రోహిత్ సాయి చల్లా, శ్రీనివాస్ చిన్ని మరియు కుటుంబం, మహాశ్విన్ విద్యా, సుసుష్మ ప్రదీప్ వేదాన్షిక సురేష్; మిహిర మొగలిపురి, శ్రేష్ఠ శ్రీమయీ దొంతంశెట్టి, అమూల్య పిన్ని ని; సంగీత రాజు, కీర్తన రాజీవ్, మెగ్గీ కరమ్, మోక్షిత చిన్ని, సాయి రేయాన్ష్ చిన్ని, హర్షవర్ధన్ ఆలేటి, శిబి నందన్ మహేష్ కుమార్, జోషిత్ మొగలి పురి, ఆరాధ్య మల్కా; పూజ బరన్వాల్, రితి నైనికా కోతా, రిధి బొజ్జిని- అంతా అలరించారు.
ఫోటోగ్రఫీ & వీడియోలు & మీడియా సహాయ సహకారాలు అందజేసిన వారు వెంకట్ , సత్యం & సర్ధార్ ఖాన్.
భోగ భాగ్యాలనిచ్చే భోగి అనే కేరింతలతో చిన్న పిల్లలకు ముత్తైదువులతో భోగి పళ్ళు పోయించి చిన్నారులని కలకాలం ఆయురారోగ్యాలతో ఉండమని దీవించారు.. చిన్న పెద్ద అందరూ కలిసి భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. ఆ సమయంలో వేదిక చాల క్యూట్‌నెస్ మరియు ఆనందంతో నిండిపోయింది.
సరదాలు తెచ్చే సంక్రాంతి, హరిదాసుల ప్రదర్శనలతో, డూ డూ బసవన్న మాటలతో అబ్బురపరిచాయి. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిసి, తెలుగు చిత్రాల పాటలు నృత్యాల వంటి అనేక సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. ప్రజలు వాటిని చూసి చాలా ఆనందించారు, పండుగలంటే ఇలా ఉండాలి అన్న అనుభూతిని కలిగించాయి. అందరు మైమరచి మన తెలుగు ఔన్నత్యాన్ని కొనియాడారు.
ఆటపాటలతో అలరించే కనుమ అనుచూ చిరంజీవి. సిబి నాథన్ కర్ర సాము నైపుణ్యంతో అందరిని ఆశ్చర్య చకితులను చేశారు. తదుపరి "సొగసు చూడ తరమా' అనుచూ భార్య భర్తల మధ్య పోటీలు ముచ్చట కలిగించాయి. మరియు చిన్నారుల అట పాటలతో ఈవెంట్‌కు మరింత వినోదాన్ని జోడించింది. కళాకారులందరికీ పార్వతి శాస్త్రి చెల్లూరి గారు, వేణుగోపాల్ రావు బెజవాడ గారు , నూకరాజు కరణం జ్ఞాపికతో సత్కరించారు.
శ్రీనివాస్ చిన్ని గారు బృందం ప్రజలందరికీ అరటి ఆకులో రుచికరమైన తెలుగు వారి సంక్రాంతి ప్రత్యేక పండుగ విందు భోజనాలు అందించారు.
కెనడా నోవా స్కోటియా సంక్రాంతి సంబరాలు ఆరు గంటల పాటు ఎంతో సరదాగా, ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమం ముగిసే సమయానికి, నిర్వాహకులు ప్రతి ఒక్కరికి, స్పాన్సర్‌లకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కెనడా నోవా స్కోటియా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ హరి గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం మూలంగా మన పండుగలు మరియు సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే ముందుకు తీసుకు వెళ్ళడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. మన సంస్కృతి మరియు ప్రేమను తరువాతి తరానికి పంచాలని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశించారు.
సుప్రజ హరి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో అనే విధంగా కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.




తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









