2025లో సౌదీ అరేబియాలో డసెర్ట్ లగ్జరీ ట్రైన్!

- January 29, 2024 , by Maagulf
2025లో సౌదీ అరేబియాలో డసెర్ట్ లగ్జరీ ట్రైన్!

రియాద్: సౌదీ అరేబియా రైల్వేస్ (SAR), లగ్జరీ రైలు ప్రయాణాలను నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన ఇటాలియన్ ఆర్సెనెల్ గ్రూప్.. సౌదీ అరేబియాలో డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ లగ్జరీ రైలు సేవను ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. 40 లగ్జరీ క్యాబిన్‌లు,  గరిష్టంగా 80 మంది ప్రయాణీకులను కలిగి ఉండే డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ రైలు 2025 వేసవిలో సౌదీ అరేబియాకు చేరుకోనుంది.  మొదటి పేయింగ్ గెస్ట్‌లు నవంబర్ 2025లో బయలుదేరతారని అంచనా వేశారు. రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రి మరియు బోర్డు ఛైర్మన్ సమక్షంలో ఇటీవల జరిగిన ఒప్పంద కార్యక్రమంలో SAR సీఈఓ డాక్టర్ బషర్ అల్-మాలిక్, ఆర్సెనెల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డు CEO పాలో బార్లెట్టా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోసౌదీ అరేబియా రైల్వేస్ (SAR) డైరెక్టర్ల ఇంజి. సలేహ్ అల్-జాసర్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. సౌదీ అరేబియా అంతటా "రైల్ క్రూజింగ్" కోసం మొదటి లగ్జరీ రైలు రియాద్ నుండి జోర్డాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉత్తర నగరం అల్-ఖురాయత్ హేల్ గుండా 770 మైళ్ల మార్గంలో నడుస్తుంది.  ఈ సందర్భంగా అల్-జాసర్ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో మొదటిసారిగా కింగ్‌డమ్‌లో లగ్జరీ రైలు సేవలను ప్రారంభించడం వల్ల రాజ్యంలో రవాణా రంగంలో గుణాత్మక సేవలు ప్రారంభం అవుతాయన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com