హైదరాబాద్–బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్..
- January 29, 2024
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 2024 ఫిబ్రవరి 26 నుంచి హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆగ్నేయాసియా ప్రాంతంతో క్యారియర్ కనెక్టివిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రెండు గొప్ప గమ్యస్థానాల మధ్య ఈ ముఖ్యమైన లింక్‌ను ఏర్పాటు చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా సరికత్త రికార్డ్ సాధించింది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ప్రయాణాలకు కీలకమైన కేంద్రంగా మారడంతో అంతర్జాతీయ గమ్యస్థానాలకు హైదరాబాద్ కనెక్టివిటీ మరింత విస్తరించింది. గ్లోబల్ ఏవియేషన్ నెట్‌వర్క్‌లో అత్యున్నత స్థాయిని, హోదాను సాధించుకుంది. ఇక ఇండిగో విషయానికొస్తే..సంవత్సరంలోనే దాని గ్లోబల్ కనెక్టివిటీని ఎనిమిది ప్రపంచ గమ్యస్థానాల నుండి 14 ప్రపంచ గమ్యస్థానాలకు విస్తరించుకుంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతాతో సహా ప్రధాన నగరాల నుంచి బ్యాంకాక్‌కు అనుసంధానించే బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇదే తరుణంలో మరో కనెక్టివిటీని హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయడం విశేషం. నివేదికల ప్రకారం, ఇండిగో ఈ కొత్త మార్గాలతో ఇండియా – బ్యాంకాక్ మధ్య మొత్తం 37 వారపు విమానాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్ట్‌గా థాయ్ రాజధానికి అనుసంధానించబడిన ఆరవ భారతీయ నగరంగా హైదరాబాద్ కు చోటు దక్కడం గర్వకారణం. ఇండిగోలో గ్లోబల్ సేల్స్ హెడ్, మిస్టర్ వినయ్ మల్హోత్రా ఈ అభివృద్ధి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆగ్నేయాసియా అంతటా తమ సేవలను విస్తరించేందుకు అనుగుణంగా, హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వరకు మా కార్యకలాపాలను ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.” అని ట్వీట్ చేశారు. ఈ కనెక్టివిటీకి హైదరాబాద్ వేదిక అవడం చాలా ఆనందంగా ఉందని తన భావనను వ్యక్తపరిచారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







