విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం.! అఘోరాగా మారిపోయాడే.!
- January 29, 2024
యూత్‌లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో విశ్వక్ సేన్. తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో తనకు తానే సాటి ఈ యంగ్ హీరో.
పెద్దగా ప్రయోగాల జోలికి పోడు. ఫక్తు కమర్షియల్ సినిమాలనే ఎంచుకుంటూ వుంటాడు. వాటితోనే యూత్‌కి కనెక్ట్ అవుతుంటాడు. అయితే, ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేసినట్లున్నాడు.
ఓ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ‘అఘోరా’ పాత్ర పోషించబోతున్నాడు. ‘గామి’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కి జోడీగా చాందినీ చౌదరి నటిస్తోంది.
కాగా, ఈ సినిమా నుంచి అఘోరాగా విశ్వక్ సేన్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ తాజాగా. అందులో హీరోకి ఓ డిజాస్టర్ వున్నట్లు తెలుస్తోంది. హ్యూమన్ టచ్ అంటే ఇష్టం. కానీ, ఆ హ్యూమన్ టచ్‌తోనే హీరోకి పెద్ద ప్రాబ్లెమ్.. వున్నట్లుగా పోస్టర్‌లో హింట్ ఇచ్చారు.
సో, ‘గామి’.. ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది. ఇదిలా వుంటే, విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. డిశంబర్‌లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సి వుంది. అయితే, అది కూడా పోస్ట్‌పోన్ అయ్యేలా వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









