సౌత్ హీరోల పై ధీటైన విలనిజం.!
- January 29, 2024
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కి అక్కడ డిమాండ్ సంగతెలా వున్నా.. టాలీవుడ్లో బోలెడంత డిమాండ్ పెరిగింది. ఈయన మొదట సైన్ చేసిన తెలుగు సినిమా ‘హరి హరవీరమల్లు’. అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది.
అయితే, తమ్ముడితో కాకపోతేనేం.! అన్నతో పని కానిచ్చేసేలా వున్నాడీ బాలీవుడ్ నటుడు. ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మాటలు రాని అత్యంత క్రూరుడైన విలన్‌గా బాబీ డియోల్ ఈ సినిమాలో నటించారు. కానీ, ఆయన ప్రెజెన్స్‌ని, పర్ఫామెన్స్నీ తెలుగు ఆడియన్స్ సరికొత్తగా ఫీలయ్యారు కాబోలు. మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
దాంతో, మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తున్నాయ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో విలన్‌గా బాబీ డియోల్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఆ ప్రత్యేకమైన పాత్రలో బాబీ డియోల్ అయితే కొత్తగా వుంటుందని భావిస్తున్నారట.
అన్నట్లు, సౌత్‌లో సూర్య హీరోగా రూపొందుతోన్న ‘కంగువ’ సినిమాలోనూ ప్రత్యేకమైన విలనిజం చూపించబోతున్నాడు బాబీ డియోల్.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







