‘ఓజీ’ వచ్చేదెప్పుడంటే.!
- January 29, 2024
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ ఆసక్తి రేకెత్తిస్తూనే వుంది. సినిమా నుంచి రిలీజయ్యే ఏ చిన్న పోస్టర్, గ్లింప్స్ అయినా సరే.. సినిమాపై అంచనాలు పెంచేలా వున్నాయ్.
సుజిత్ ఈ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ‘సాహో’తో తనపై పడిన మచ్చ చెరిపేసుకోవాలనుకుంటున్నాడు ‘ఓజీ’తో.
అయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పొలిటికల్ హీట్ పెరిగిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ నుంచి డేట్స్ తీసుకునే పరిస్థితి లేదు. దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో 15 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే పూర్తయ్యే అవకాశం వుంది.
అయితే, పవన్ నుంచి ఆ డేట్స్ చాలా చాలా కష్టమైన పని. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం డేట్స్ కేటాయించబోతున్నారనీ తెలుస్తోంది.
సో, త్వరలోనే ‘ఓజీ’ కంప్లీట్ చేసే యోచనలో సుజిత్ అండ్ టీమ్ వున్నారట. అన్నీ కలిసొస్తే.. వచ్చే ఏడాది ఆగస్ట్‌కల్లా ‘ఓజీ’ ధియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







