సౌత్ హీరోల పై ధీటైన విలనిజం.!

- January 29, 2024 , by Maagulf
సౌత్ హీరోల పై ధీటైన విలనిజం.!

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌కి అక్కడ డిమాండ్ సంగతెలా వున్నా.. టాలీవుడ్‌లో బోలెడంత డిమాండ్ పెరిగింది.  ఈయన మొదట సైన్ చేసిన తెలుగు సినిమా ‘హరి హరవీరమల్లు’. అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది.
అయితే, తమ్ముడితో కాకపోతేనేం.! అన్నతో పని కానిచ్చేసేలా వున్నాడీ బాలీవుడ్ నటుడు.  ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మాటలు రాని అత్యంత క్రూరుడైన విలన్‌గా బాబీ డియోల్ ఈ సినిమాలో నటించారు. కానీ, ఆయన ప్రెజెన్స్‌ని, పర్‌ఫామెన్స్‌నీ తెలుగు ఆడియన్స్ సరికొత్తగా ఫీలయ్యారు కాబోలు. మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
దాంతో, మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తున్నాయ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో విలన్‌గా బాబీ డియోల్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఆ ప్రత్యేకమైన పాత్రలో బాబీ డియోల్ అయితే కొత్తగా వుంటుందని భావిస్తున్నారట.
అన్నట్లు, సౌత్‌లో సూర్య హీరోగా రూపొందుతోన్న ‘కంగువ’ సినిమాలోనూ ప్రత్యేకమైన విలనిజం చూపించబోతున్నాడు బాబీ డియోల్.!  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com