‘విశ్వంభర’ డేట్ ఫిక్స్ చేశారు కానీ.!
- January 29, 2024
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘విశ్వంభర’ అని ఇంతవరకూ ప్రచారంలో వున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ వుండబోతోందని మేకర్లు ప్రకటించారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ కూడా తెర పైకి వచ్చింది. మొదట్లో అనుకున్నట్లే సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
జనవరి 10న ‘విశ్వంభర’ ధియేటర్లలో సందడి చేయనుందట. అయితే, ఏడాదికి ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు సరిగ్గా ఆ టైమ్‌కి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదర్కోవాల్సి వస్తున్నాయో ఈ మధ్య చూస్తున్నాం.
అన్నీ కలిసొచ్చి.. అనుకున్న డేట్‌కే రిలీజ్ అయితే నో ప్రాబ్లమ్. కానీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడడం.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం..కారణాలేమైనా కావచ్చు.. ఈ తరహా పరిస్థితుల్ని తట్టుకోవడానికి సిద్ధంగా వుండాల్సిందే.
అయితే, అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి. అలాగే డైరెక్టర్ వైపు నుంచి కూడా ఒకింత పాజిటివ్ సైనే కనిపిస్తోంది. కోవిడ్ అననుకూల పరిస్థితుల్లో ‘బింబిసార’ స్టార్ట్ చేసి పూర్తి చేసిన వశిష్టనీ తక్కువ అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







