సైనసైటిస్ వున్న వాళ్లు ఈ డైట్ తప్పక పాఠించాల్సిందే.!

- January 29, 2024 , by Maagulf
సైనసైటిస్ వున్న వాళ్లు ఈ డైట్ తప్పక పాఠించాల్సిందే.!

బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ద్వారా ఇన్‌ఫ్లమేటరీ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల సైనసైటిస్ వస్తుంది. సైనస్ వున్నవాళ్లలో తరచూ తలనొప్పి, ముక్కు కారడం.. వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
నాసికా రంధ్రాలు మూసుకు పోవడంతో గాలి పీల్చుకోవడం  ఇబ్బందవుతుంది. అయితే, సైనస్ సమస్యకు శాశ్వత పరిష్కారం వుందా.? అంటే.. ప్రస్తుతం అనేక రకాల మందులు, సర్జరీ చికిత్సలు అందుబాటులో వున్నాయ్.
అయితే, ఒక్కసారి సైనస్ ఎటాక్ అయినవాళ్లు తప్పనిసరిగా తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాఠించాలి.స
పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు శ్లేష్మాన్ని చిక్కదనం చేస్తాయ్. తద్వారా ముక్కు మరింతగా పట్టేసినట్లుండడం, నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుంది.
చక్కెర వినియోగం సైనస్ వున్నవారికి చాలా పెద్ద సమస్యగా చెప్పొచ్చు. వీలైనంత తక్కువగా చక్కెరను వినియోగించాలి. చక్కెర వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లతో  పోరాటం చేసే శక్తి శరీరానికి తగ్గుతుంది. సైనస్ వ్యాధిగ్రస్థులకు ఇది ఓ శాపమే అని చెప్పొచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల సైనస్ వాపు వేధిస్తుంది. అలాగే మసాలా అధికంగా వున్న ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com