తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- April 27, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 57 వేల 909 మంది స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.81 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. శ్రీవారి సేవలో భాగంగా టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ భక్తులు పాలుపంచుకుంటారు. స్వామివారి సేవ కోసంవచ్చిన వారికి భోజనం, బసతోపాటు చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. 2000లో శ్రీవారి సేవ వ్యవస్థను తీసుకొచ్చింది టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం, ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారి కోసం శ్రీవారి సేవకులు పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్‌సైట్, యాప్ ద్వారా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







