పనీర్ జామూన్
- May 31, 2016
కావలసిన పదార్థాలు : కోవా - 60 గ్రా., పనీర్ 10 గ్రా., మైదా - 10 గ్రా., యాలకుల పొడి - 6 గ్రా., పాలు - 1 లీటరు, పంచదార - 100గ్రా., కుంకుమపువ్వు - 2 గ్రా., పాకానికి - (నీరు 20 మి.లీ. + పంచదార 90 గ్రా), అలంకరణకు తరిగిన పిస్తా , బాదంలతో పాటు కొంత సిల్వర్ లీఫ్.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో సన్నగా తరిగిన పనీర్, కోవా, మైదా, యాలకులపొడి వేసి మెత్తగా ముద్దలా కలుపుకోవాలి (అవసరమైతే కొన్ని పాలు కలుపుకోవచ్చు). దీన్ని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని నూనెలో దోరగా వేగించి పంచదార పాకంలో (ముందే తయారుచేసి ఉంచుకోవాలి) నానవేయాలి. మరో పాత్రలో పాలను, పంచదారను కలిపి 30 శాతం మిగిలేలా మరిగించుకోవాలి. పాకంలో నానిన ఉండల్ని ఒక పాత్రలోకి తీసుకుని పాల మిశ్రమాన్ని వాటిపైన మునిగేలా పోసి పిస్తా, బాదం, సిల్వర్‌లీఫ్‌లతో అలంకరిచి తినాలి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









