మోచేతులు మెరవడానికి చిట్కాలు ..
- May 31, 2016
మోచేతులు మెరిసేలా! ముఖం, మెడ గురించి అందరూ శ్రద్ధ పెడతారు. కానీ మోచేతుల గురించి మాత్రం చాలామంది పట్టించుకోరు. అవి నల్లగా ఉంటే పొట్టి చేతుల దుస్తులు ధరించినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఆ నలుపు తగ్గించుకునేలా చూసుకోండి. అదెలాగంటే..
చక్కెర: మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నల్లగా, బరగ్గా మారుతుంది. ఆ సమస్య నుంచి బయట పడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నలుపుదనం కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ: నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నిమ్మకాయను సగానికి కోసి చక్కెరలో అద్ది మోచేతులపై రుద్దాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి తేనెతో సున్నితంగా మర్దన చేయాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందించి నలుపు తగ్గిస్తుంది.
బంగాళాదుంప: ఇందులోనూ బ్లీచింగ్ గుణాలుంటాయి. రెండు బంగాళాదుంపల్ని గుజ్జుగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పూతలా రాయాలి. కాసేపయ్యాక మర్దన చేసి కడిగేస్తే చర్మం చక్కగా నిగారింపును సంతరించుకుంటుంది.
ఆలివ్‌నూనె: ఈ నూనెతో మర్దన చేయడం వల్ల బరగ్గా మారిన చర్మం మృదువుగా మారుతుంది. నలుపుదనం కూడా తగ్గుతుంది. ఆలివ్ నూనెను కాస్త వేడి చేసి అందులో బాదం, కొబ్బరినూనెను కొద్దికొద్దిగా కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. ప్రతిరోజూ రాత్రిపూట ఇలా చేయడం వల్ల క్రమంగా చర్మం రంగుమారి మృదువుగా తయారవుతుంది.
చందనం: చర్మ రంగును మార్చి.. చక్కటి నిగారింపును సొంతం చేసుకోవడానికి చందనం దోహదం చేస్తుంది. రెండుచెంచాల గంధంలో కొద్దిగా తేనె కలిపి మోచేతులకు రాయాలి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. తేనె తేమనందించి మృదువుగా మారుస్తుంది.
పెరుగు: సెనగపిండీ, పెరుగూ సమపాళ్లలో తీసుకుని పూతలా వేసుకోవాలి. పొడిగా అయ్యాక కాసిని నీళ్లు చల్లి మర్దన చేసుకుని కడిగేయాలి. సెనగపిండి నలుపును తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







