వెడ్డింగ్ ప్లానర్‌పై నూతన దంపతులు దావా.. BD5,000 చెల్లించాలని డిమాండ్
- January 30, 2024
బహ్రెయిన్: పిక్చర్-పర్ఫెక్ట్ ఫెయిరీ టేల్ వెడ్డింగ్ అనేది బహ్రెయిన్ జంటకు పీడకలగా మార్చింది. వారి కలల రోజును వెడ్డింగ్ ప్లానర్ సంస్థ నాశనం చేసినట్లు ఓ జంట ఆరోపించింది. తాజాగా వెడ్డింగ్ ప్లానర్‌పై BD5,000 కోసం దావా వేశారు. బహ్రెయిన్ హై సివిల్ కోర్ట్ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. తమతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. వెడ్డింగ్ ప్లానర్ తమకు సర్వీస్ అందివ్వలేదని, పైగా తమను తీవ్ర అసహనానికి, అవమానానికి గురిచేసారని పిటిషన్ లో నూతన వధూవరులు ఆరోపించారు. దంపతులకు ఏర్పాటు చేసిన డిజైన్‌లు, ఏర్పాట్లు ముందు అనుకున్న రీతిలో లేవని, నాసిరకం ఏర్పాట్లు, వస్తువులను వెడ్డింగ్ సందర్భంగా ఉపయోగించారని పేర్కొన్నారు. తాము వారిపై పెట్టిన నమ్మకాన్ని దెబ్బతీసిందన్నారు. సరిపోలని వేదిక బ్యాక్‌డ్రాప్‌లు, వేడుకకు కొన్ని గంటల ముందు ఘాటైన రంగులతో రంగులు వేసిన పూల అమరికల నుండి చెత్త ఫ్లోరింగ్ మరియు నాసిరకం లైటింగ్ వరకు, పెళ్లిని నిర్వహించడం ఆశించిన స్థాయిలో జరగలేదని కొత్త దంపతులు ఆరోపించారు. "జీవితంలో ఒకసారి జరిగే సంఘటన కోసం వారు పెద్ద మొత్తాన్ని చెల్లించారు. వారి కలల రోజును వెడ్డింగ్ ప్లానర్ అస్తవ్యస్తంగా మార్చింది" అని కొత్త జంట తరఫు న్యాయవాది వాదించారు. కంపెనీ నిర్లక్ష్యానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు మరియు ఒప్పందాన్ని పూర్తి సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. వారు అనుభవించిన మానసిక క్షోభ, భౌతిక మరియు నైతిక పరిహారం కింద ఆ జంట BD5,000 డిమాండ్ చేశారు. న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







