యూఏఈలో 'ఫైటర్'పై శాశ్వత నిషేధం!
- January 30, 2024
యూఏఈ:ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ 'ఫైటర్' యూఏఈలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ సినిమా జనవరి 27న యూఏఈలో విడుదల కావాల్సి ఉంది. 'ఫైటర్' శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వోక్స్ మరియు రీల్ సినిమాస్‌కి చెందిన కస్టమర్ కేర్ ఏజెంట్లు ఈ సినిమాను యూఏఈలోని అధికారులు మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. "ఈ సినిమాని దుబాయ్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని సినిమా థియేటర్లలో షోలను నిలిపివేశారు. " అని రీల్ సినిమాస్ కస్టమర్ కేర్ ఏజెంట్ అప్పట్లో తెలిపారు. మరోవైపు యూఏఈలోని సినిమా పంపిణీదారు అయిన హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా Xపై ఒక ప్రకటన విడుదల చేసింది. "హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనే నటించిన ఫైటర్ విడుదల ప్రస్తుతం యూఏఈలో నిలిపివేశారు. పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము మరిన్ని అప్‌డేట్‌లను షేర్ చేస్తాము." అని పేర్కొన్నారు. ఇంతకుముందు, హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొణె నటించిన చిత్రం యూఏఈ మినహా గల్ఫ్ అంతటా నిషేధించబడుతుందని భారతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 'ఫైటర్' అనేది భారత వైమానిక దళ సభ్యుల చుట్టూ తిరిగే యుద్ద ఆధారిత సినిమా. ఇది షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్), మినల్ రాథోర్ (దీపికా పదుకొణె) భారతదేశ జాతీయ భద్రతా పరిస్థితులను, ఆ సమయంలో వారి జీవితాన్ని ఇందులో చూపించారు. దుబాయ్‌లో ఉన్న భారతీయ వీడియోగ్రాఫర్ ఇహాబ్ ఖదీర్ మాట్లాడుతూ.. కొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని ఎందుకు వివాదాస్పదంగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు కళ ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ మరియు సౌదీ అరేబియాతో సహా GCC అంతటా ఉన్న దేశాల్లో ఈ చిత్రాన్ని నిషేధించారు. యూఏఈలో సినిమా నిలిపివేయడం లేదా ఆలస్యం కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటైన 'బార్బీ' యూఏఈలో ఆలస్యంగా విడుదలైంది. 2022లో మలయాళ చిత్రం 'సీతా రామం' కూడా ఆలస్యంగా విడుదలైంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









